ఎన్ని ఫ్లాప్స్ వచ్చిన అస్సలు తగ్గని రవితేజ…. పారితోషికం ఎంతో తెలుసా?

రవితేజ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తాం. కామెడీ కానీ ఫైట్స్ కానీ ఎక్కడ తగ్గకుండా ఫుల్ జోష్ లో ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి. అయినా సరే తన తీరు మార్చుకోకుండా అదే ఫార్ములాతో ముందుకు సాగుతున్నాడు. అంతేకాకుండా పారితోషికం కూడా అస్సలు తగ్గించుకోవడం లేదట. ఒక్కో సినిమాకి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమా క్రాక్ కరోనా కారణంగా విడుదల కాలేదు.

ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో మరో సినిమాకి ఓకే చెప్పాడు. ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం రవితేజ 15 కోట్లు అడుగుతున్నాడట. కథ మీద ఉన్న నమ్మకంతో రవితేజ అడిగిన పారదర్శకం ఇవ్వటానికి సిద్ధం అయ్యారట యు.వి.క్రియేషన్స్ వారు.రవితేజ ఫ్లాప్స్ వచ్చిన అసలు వెనకడుగు వేయడం లేదు.

error: Content is protected !!