గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి.. ఈరోజు ఎలా ఉన్నాయంటే

గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు అడ్డుకట్ట పడింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా అదే దారి పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గటంతో మన దేశంలో కూడా అదే ట్రెండ్ ఫాలో అయి తగ్గాయి.

హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.54 వేల కిందకు వచ్చేసింది. రూ.53,950కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.70 క్షీణించింది. దీంతో ధర రూ.49,450కు తగ్గింది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.69,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

error: Content is protected !!