బిగ్ బాస్ అసలు మజా ఎప్పుడు వస్తుందో తెలుసా ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభం అయ్యి ఇప్పటికీ రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఇంటి సభ్యులు అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు శని ఆదివారాలు నాగార్జున వస్తాడు కదా. వచ్చి ఇంటి సభ్యులకు గట్టిగా క్లాస్ పీకాడు. కాబట్టి ఈరోజు నుంచి షో తీరు మారుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ప్రేక్షకుల నుంచి సానుభూతి కొట్టేయాలని ఆలోచనతోనే ఉన్నారు.

నాగార్జున సానుభూతితో ఓట్లు రావని చెప్పాడు. ఈ వారం టాస్క్ లు నామినేషన్ ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. బిగ్ బాస్ లో ఎన్ని గొడవలు ఉంటే అంత ఎక్కువ రేటింగ్ ఉంది. కాబట్టి షో ఆ దిశగానే సాగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి షో విధానమే మారిపోతుంది. షో రక్తి కట్టే విధంగా ఉంటే ఐపీఎల్ జోలికి వెళ్లరు. మరి ఈ రోజు ఎలా ఉంటుందో వేచి చూడాలి.