సుజాత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కరాటే కళ్యాణి

తెలుగు బిగ్ బాస్ సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. అప్పుడే రెండు వారాలు గడిచిపోయింది. మొదటి వారం సూర్య కిరణ్ ఎలిమినేట్ కాగా రెండో వారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి ని నాగార్జున స్టేజ్ మీదకి ఆహ్వానించాడు. ఈ క్రమంలో కరాటే కళ్యాణి సుజాత గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

సుజాత నవ్వు నటిస్తుందని, నిజమైన నవ్వు కాదని, తన నవ్వు కాస్త ఓవర్ గా ఉంటుందని కరాటే కళ్యాణి చెప్పింది. అంతేకాకుండా సుజాత తన మంచితనం చెప్పుకోవటానికి ఇతరులపై ఏదోఒకటి చెపుతుందని కరాటే కళ్యాణి సుజాత గురించి చెప్పింది.

error: Content is protected !!