. చిరంజీవి గుండు మేకప్ వేయడానికి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే షాక్ అవుతారు

హీరోలకు మేకప్ అనేది ఓ ప్రత్యేకత. డిఫెరెంట్ రోల్స్ కి తగ్గ మేకప్ తీర్చిదిద్దడం ఒక కళ. కొందరు హీరోలకు వెరైటీ మేకప్ లు వేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మేకప్ మ్యాన్ చాలా కష్టపడాల్సి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు ఖర్చు కూడా ఇందుకోసం ఎక్కువే అవుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గుండు మేకప్ తో ఫోటోలు వైరల్ అవ్వడం, దానికి స్వయంగా చిరు వివరణ ఇవ్వడం అయింది.

స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి రాజకీయాలనుంచి సినిమాల్లోకి వచ్చాక కూడా వేగం తగ్గించలేదు. 65ఏళ్ళవయస్సులో కూడా తన సత్తా చాటుతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్న చిరంజీవి హర్బన్ మాక్ అంటూ గుండు లుక్ తో అదరగొట్టిన చిరంజీవి నిజంగా గుండు చేయించుకున్నట్లే అందరూ భావించారు. ఈ వయస్సులో చేస్తున్న మ్యాజిక్ కి ఫాన్స్ ఫిదా అయ్యారు.

అయితే ఇది మేకప్ టెక్నీషియన్స్ చేసారని, లుక్ వెనుక సీక్రెట్ ని స్వయంగా చిరంజీవి చెప్పేసారు. ‘నా గుండు లుక్ ని నిజమని నమ్మే విధంగా చేసిన మేకప్ టెక్నీషియన్ కి సెల్యూట్’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ లుక్ బయట పడకముందు మెహర్ రమేష్ మూవీ కోసం అని అనుకున్నారు. కానీ సీక్రెట్ బయట పెట్టేసాక ఆచార్య మూవీ కోసమేనని భావిస్తున్నారు. ఇండియాలో నెంబర్ వన్ టెక్నీషియన్ చేతే ఇలా చేయించారని,గంటకు లక్షల్లో ఖర్చవుతుందని, ఒక రోజంతా పట్టడంతో ఎన్ని లక్షలు అయి వుతుందోనని అందరూ అంటున్నారు.