సినిమా ఏదైనా సరే… తమన్నా రెమ్యునరేషన్ అదేనట…అసలు తగ్గటం లేదు

హ్యాపీ డేస్ మూవీస్ తో పేరులోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా ఆతర్వాత వరుసగా అగ్ర హీరోలందరి సరసన చేస్తూ వస్తోంది. మెగాస్టార్ తో సైరా మూవీలో కల్సి నటించింది. బాహుబలి వంటి వరల్డ్ వైడ్ మూవీలో చేసిన ఈ అమ్మడు సరిలేరు నీకెవ్వరూ లాంటి మూవీలో ఐటెం సాంగ్ చేసి,పాపులర్ అయింది. మొత్తం మీద టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఇప్పటి హీరోయిన్స్ కి పోటీనిస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో చేస్తోంది. కరోనా లాక్ డౌన్ తో ఈ సినిమా ఆగింది.

ఇప్పుడిప్పుడే సినిమాలు తీస్తున్న నేపథ్యంలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నట్లు టాక్. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ తెలుగులో రీమేక్ గా టాలీవుడ్ లో సత్యదేవ్ హీరోగా నటించనున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో కూడా ఈ అమ్మడు చేస్తోంది. అలాగే యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో కూడా మిల్కీ బ్యూటీ నటించడానికి ఒకే చెప్పింది.

అయితే తమన్నా ఈ రెండు సినిమాలకు పారితోషికం విషయంలో వస్తున్న వార్తలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. వీటికి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఏకంగా రెండు కోట్లు అడుగుతోందట. అది సినిమాలైనా, వెబ్ సిరీస్ లు అయినా, పాత్ర నిడివి ఎంతున్నా సరే, హీరోయిన్ రోల్ అయినా, కాకున్నా ,ఒకవేళ నెగెటివ్ రోల్ అయినా కూడా ఎమౌంట్ విషయంలో తేడా ఉండదట. అంతేకాదు, హీరో ఎవరైనా ఒకే నట. ఓటీటీలో రిలీజ్ అయినా.. బిగ్ స్క్రీన్ మీద ఇలా ఎన్ని రకాలుగా చూసినా 2 కోట్లు ముట్టజెప్పాల్సిందేనట. కొత్తగా కమిట్ అయిన రెండు మూవీస్ కి ఇలాగే డబ్బు ఇస్తున్నారట.

error: Content is protected !!