ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తెలిసిపోయింది… అప్పుడే?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మూడో వారంలో కి అడుగు పెట్టింది. మొదటి రెండు వారాలు సేఫ్ జోన్ లో గేమ్ ఆడిన మూడో వారం మాత్రం మాస్క్ తీసేసి ఆడాల్సి వచ్చింది. నాగార్జున శనివారం ఆదివారం ఇంటి సభ్యులను తీవ్రంగా హెచ్చరించడంతో నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఈ నామినేషన్ ప్రక్రియ లో కుమార్ సాయి కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత మోనాల్ హారిక మెహబూబ్ అరియన ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరందరిలో వీక్ కంటెస్టెంట్ ఎవరు అంటే కుమార్ సాయి.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే హౌస్ లో ఎవరితోనూ కలవలేకపోయారు. ఎలిమినేషన్ లో ఉన్న మిగతా వారు క్రేజ్ ఉన్న వాళ్ళే కాబట్టి ఈ వారం కుమార్ సాయి హౌస్ నుంచి బయటికి వచ్చేయొచ్చు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూద్దాం మరి ఏమి జరుగుతుందో బిగ్బాస్ లో ఏదైనా జరగొచ్చు.

error: Content is protected !!