చమక్ చంద్ర ఆస్తులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు

కోట్లు సంపాదించడమెలా అనే అంశంపై తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొస్తున్న మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఎంత పెద్దవారైనా, అంబానీ అయినా సరే, ప్లానింగ్ లేకపోతె ఫెయిల్ కాకతప్పదని,డబ్బు గురించి చెబుతూ నాగబాబు వివరించాడు. డబ్బు సంపాదించడమే గొప్ప ఆర్ట్ అని ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణంగా చెప్పుకొచ్చాడు.

ఇక జబర్దస్త్ కామెడీ షో కంటెస్టెంట్ చమక్ చంద్ర ఆస్తుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసినా అంతగా గుర్తింపు రాకుండా ఉండిపోయిన చమక్ చంద్ర తన కామెడీ స్కిట్స్ తో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఇళ్లల్లో జరిగే కష్ఠాలను కామెడీ స్కిట్ ద్వారా చెబుతూ స్టార్ స్టేటస్ తెచ్చుకున్న చమక్ చంద్ర ఆతర్వాత అదిరింది షోకి వెళ్ళాడు. జబర్దస్త్ నుంచి చమక్ చంద్రతో అనుబంధం ఉండడం,అతడి స్కిట్స్ ని నాగబాబు బాగా ఎంజాయ్ చేయడం వలన అతడి గురించి నాగబాబు కొన్ని విషయాలను వెల్లడించాడు.

“చమక్ చంద్ర ఓ ప్లానింగ్ తో ఎదిగి ఓ సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకున్నాడు. దానివిలువ 80లక్షలు ఉంటుంది. అంతేకాదు, ఓ బిఎం డబ్ల్యు కారు కూడా ఉంది’అని చమక్ చంద్ర గురించి నాగబాబు గొప్పగా చెప్పుకొచ్చాడు. ఒక హీరో పేరు చెప్పలేని గానీ, ఎప్పుడూ అప్పులే. ఇక వేటూరి గారు చనిపోయాక ఆయన అప్పుల గురించి తెల్సి బాధ పడ్డాను. ఏదైనా ప్లానింగ్ లేకుంటే దెబ్బతింటాం’అని వివరించాడు.

error: Content is protected !!