శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే ఏమి జరుగుతుందో తెలుసా ?

ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది. దాంతో కరోనా రాకుండా ఉండటానికి సులువైన మార్గాలు కోసం అన్వేషిస్తూ విటమిన్ డి టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలా విటమిన్-డి టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది. వైద్యుని సలహా లేకుండా విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోకూడదు.

శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం స్థాయి కూడా పెరిగి ఆకలి తగ్గిపోవటం రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఎముకల మీద వ్యతిరేక ప్రభావం పడుతుంది. విటమిన్ డి తీసుకొంటే వైరస్ బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందవచ్చు. అయితే మోతాదుకు మించి తీసుకోకూడదు. విటమిన్-డి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తొందరగా కనపడవు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ డి టాబ్లెట్స్ వాడాలి.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి