ఆది పురుష్ సినిమాల్లో లక్ష్మణుని పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా ?

ఓం రావత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్నది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా వేస్తున్నాడు. రావణాసురుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నాడు. సీత పాత్ర కోసం కీర్తి సురేష్ కైరా అద్వానీ అనుష్క శర్మ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా సీత పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయలేదు.

ఇదిలా ఉండగా లక్ష్మణుడి పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేశారా అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ పాత్ర కోసం సౌత్ నటుడుని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందట ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. గ్రాఫిక్స్ కోసం కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు.