Beauty Tips

సులభంగా ఇంటిలో దొరికే వస్తువులతో చుండ్రును మాయం చేయవచ్చు…ఇది నిజం

Chundru Home remedies In telugu : ఈ మధ్య కాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంది. చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే తొందరగా తగ్గదు. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.
besan
శనగపిండి
ఒక కప్పు పెరుగులో నాలుగు స్పూన్ల శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కలపి మెత్తని పేస్ట్‌ గా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.
fenugreek seeds
మెంతులు, పెరుగు పేస్ట్‌
మెంతులను ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని వెంట్రుకలకు బాగా పట్టించాలి. మెంతులు చుండ్రు నివారణలో చాలా బాగా పని చేస్తాయి.
henna leaf
గోరింటాకు
గోరింటాకును కోసిన వెంటనే రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది. అందులో ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కూడా కలిపితే మరింత మంచి ఫలితం వస్తుంది.

ఉసిరి పొడి
ఉసిరి పొడిని అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరి పొడిని తీసుకోని దానిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత తల మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే తొందరగా తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.