ఎస్పీ బాలు మృతిపై స్పందించని అమితాబచ్చన్

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అమితాబచ్చన్ ఎస్పీ బాలు మృతిపై మాత్రం స్పందించలేదు. తాను కరోనా బారిన పడ్డ అప్పుడు కూడా ఆసుపత్రిలో బెడ్ పై నుండి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి అమితాబ్ తన ఆరోగ్య స్థితిపై ట్వీట్లు చేసేవాడు. ప్రతి సంఘటన పై ట్విట్టర్ లో ట్వీట్లు ద్వారా స్పందించే అమితాబ్, ఎస్పీ బాలు మృతిపై ఏమాత్రం స్పందించలేదు. దీనికి కారణం ఏమై ఉంటుందని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. అసలు అమితాబ్ ఎందుకు స్పందించలేదు తాను కూడా కరోనా బారిన పడిన అనుభవం బట్టి ఎస్పీ బాలు మృతిపై స్పందించడం అమితాబ్ కి కష్టం అయిందా లేక అయిష్టత ఏమైనా ఉందా.

ఏమైనా నిజం చెప్పాలంటే భారతీయ సినిమా విషయానికొస్తే, ఎస్పీ బాలు bigger than బచ్చన్ అనే విషయాన్ని అమితాబ్ జీర్ణించుకోలేక ట్వీట్ చేయలేదా. లేక కరోనాను స్వయంగా అనుభవించిన బాధ తెలిసిన వ్యక్తిగా ఎస్పీ బాలు మృతిని ఇంకా జీర్ణం చేసుకోలేక ట్వీట్ చేయలేకపోయా డా.. సరే కొన్ని రోజులు వేచి చూద్దాం.

error: Content is protected !!