Healthhealth tips in telugu

ఈ సమస్యలు ఉంటే చెరకు రసం అసలు తాగవద్దు…చాలా ఇబ్బందులు…!

sugarcane juice :ప్రస్తుతం మారిన పరిస్థితి కారణంగా తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.చెరుకులో కూడా రకాలున్నాయి. వీటిలో తెల్ల చెరుకు, నల్ల చెరుకు, ఎర్ర చెరుకు అనేవి ప్రధానమైనవి. ఐతే అన్ని రకాల చెరుకు గుణాలు దాదాపు ఒక్కటే. చెరుకు రసం తాగినప్పుడు మొదట్లో కొద్దిగా వేడి చేసినట్లనిపిస్తుంది. కానీ తర్వాత చలవ చేస్తుంది. చెరుకు రసం తాగితో కొవ్వు చేరుతుంది. రక్తాన్ని శుభ్రం చేయడమే కాదు పురుషుల్లో వీర్యపుష్టిని కలిగిస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది.
Sugarcane juice
కొంతమంది చెరుకును కాల్చి దాని రసాన్ని పిండి తాగుతుంటారు. ఇలా చేయకూడదు. ఇది వాతం చేస్తుంది. కంటి సమస్యలను కలిగిస్తుంది. చెరుకును తినేటప్పుడు, చెరుకు రసాన్ని తీసేటప్పుడు చెరుకు కొనల, మొదళ్లను, కణుపులను తీసివేసి మిగతా భాగాన్ని తినాలి. భోజనం చేసిన వెంటనే చెరుకు రసం తాగకూడదు. తాగితే ఆహారం సరిగా జీర్ణం కాదు.
Sugarcane Health benefits in telugu
యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసాన్ని కొందరు తాగుతుంటారు. ఇందులో అనేక మలినాలుంటాయి. అందువల్ల దాన్ని తీసుకోకూడదు. పిల్లలు పళ్లు పుచ్చుపట్టి నలుపెక్కి వుంటే చెరుకుని తిన్నప్పుడు పుచ్చిపోయిన పళ్లు తెల్లగా వస్తాయి. చెరుకు రసాన్ని మధుమేహం, అజీర్ణం, ముక్కు సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, శరీరం వాపు వున్నవారు తాగకూడదు.
sompu
ఐతే చెరుకు రసాన్ని ఎక్కువ తాగి ఇబ్బందిపడుతుంటే దానికి విరుగుడుగా సోంపు గింజల రసం, అల్లపు రసం పనిచేస్తాయి. చూశారుగా ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.