MoviesTollywood news in telugu

Nenokkadine movie:వన్ నేనొక్కడినే సినిమా డిజాస్టర్ కావటానికి 4 కారణాలు…

Mahesh Babu Nenokkadine movie telugu : ప్రతి ఫ్రేమ్ లో రిచ్ నెస్ , క్వాలీటీ కనిపించే మూవీగా టీజర్, ట్రైలర్ నుంచి ఆకట్టుకున్న మూవీ వన్ నేనొక్కడినే చివరకు డిజాస్టర్ అయింది. సుకుమార్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ మూవీలో ఏదో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఉంటుందని మనకు తెలుస్తుంది.

ముగ్గురు వ్యక్తులు తన తల్లి దండ్రులను చంపడం దగ్గర నుంచి తన పేరెంట్స్ ఎవరో తెల్సుకునే వరకూ చాలా డెప్త్ తో నడిచిన ఈ సినిమా ఓ పట్టాన ఊహకు అందని విధంగా పక్కా స్క్రీన్ ప్లే తో సాగింది. ఈ సినిమా 2014జనవరి 10న ఈ మూవీ రిలీజయింది. వండర్ ఫుల్ మూవీ మిస్ ఫైర్ అయిందా అన్నట్లు ఈ మూవీ పరిస్థితి అయింది.

స్క్రీన్ ప్లే బాగున్నా అది కన్ఫ్యూజ్ గా ఉండడం ఈ మూవీ ప్లాప్ కి ఒక కారణం. నార్మల్ ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా ఈ మూవీ ని తెర కెక్కించడంలో సుకుమార్ ఫెయిలయ్యాడు. ఆడియన్స్ రేంజ్ ని హై లెవెల్లో ఊహించి తీసాడా అన్పిస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ, స్క్రీన్ ప్లే కల్సి రాలేదు. జరుగుతుందా, ఊహించుకుంటున్నాడా అనే తెలియని కన్ఫ్యూజన్ లో ఆడియన్స్ ని పడేశారని చెప్పాలి.

క్లైమాక్స్ లో అన్నింటికీ సమాధానం ఇచ్చినా, అప్పటికే ఓపిక నశించి పోవడం వలన ఎండింగ్ సీన్ కి కనెక్ట్ కాలేదు జనం. సినిమాలో కన్ఫ్యూజన్ సృష్టించడం వేరు, ఆడియన్స్ లోనే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తే సీన్ రివర్స్ అవుతుంది. ఆడియన్స్ తో ఆడుకుని కిక్కు ఇవ్వాలనుకున్న సుకుమార్ ప్లాన్ రివర్స్ అయింది. బైక్ తో చేజ్ చేసి, విలన్ ని మహేష్ చంపడాన్ని హీరోయిన్ షూట్ చేసి, ఛానల్ లో ప్రసారం చేస్తే, కేవలం మహేష్ ఒక్కడే కనిపిస్తాడు.

ఎవరినో కొడుతున్నట్లు ఊహాగా ఉంటుంది. ఇది థ్రిల్ గానే ఉన్నా, సినిమా అంతటా అలాగే చేయడం చిరాకు పుట్టించింది. సాధారణంగా రెండు గంటల 10నిముషాలు మించకుండా ఇలాంటి మూవీస్ ఉండాలి. కానీ 2గంటల 50నిమిషాల నిడివి కావడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. ఇది పెద్ద మైనస్ పాయింట్.

ఇక రిలీఫ్ కి కామెడీ సీన్స్ మధ్య మధ్యలో ఉంటె బాగుండేదన్న ఫీలింగ్ అందరిలో వచ్చింది. హీరో అన్వేషణ, పగ లో ఆడియన్స్ కూడా భాగం అయ్యేలా చేయాలి. కానీ డైరెక్టర్ అది మిస్సయ్యాడు. చివరిలో ఎంత ఎమోషన్ కనెక్షన్ చేసినా అప్పటికే సీట్లలో జనం ఖాళీ అయ్యేలా చేసింది.