పుట్టిన రోజు బట్టి.. ఎదుటివారు ఎలాంటి వారో చెప్పేయచ్చు.. మీరూ ట్రై చెయ్యండి

మీరు ఏ రోజున పుట్టారో తెలుసుకాబట్టి.. మీరు ఎలాంటి వారో ఈ కింద చూడండి..

సోమవారం – సోమవారం నాడు పుట్టిన వారు అందర్ని యిట్టె ఆకర్షిస్తారు. అంతేకాదు కుటుంబ వ్యవహారాల్లో సమయస్పూర్తిని ప్రదర్శిస్తారు. వీరు విజయం కోసం కృషి చేసే వ్యక్తి. వీరు ఉన్న రంగంలో వీరి నాయకత్వం కనిపిస్తుంది.

మంగళవారం – మంగళవారం నాడు పుట్టిన వారు అన్నింట్లో విజయం సాధిస్తారు. విమర్శలకు సున్నితంగా సమాధానం ఇస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి కష్టపడతారు. అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉంటారు.

బుధవారం – బుధవారం నాడు జన్మించిన వారు కోట్లాటలకు దూరంగా ఉంటారు. వీరి మదిలో ద్వేషాన్ని ఎక్కువ సేపు ఉంచుకోలేరు. అందరితో కలుపుగోలుగా ఉంటారు. వీరికి కష్టపడేతత్వం ఎక్కువ.

గురువారం – గురువారం రోజున పుట్టిన వారు ప్రశంసలు పొందుతుంటారు. ఆకర్షణీయంగా, కష్టపడేతత్వంతో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. సాహాసాలు, స్వతంత్ర్యంగా జీవించే అంశాలు పుష్కలంగా ఉంటాయి.

శుక్రవారం – శుక్రువారం పుట్టిన వారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. స్నేహితులతో, ప్రజల్లో తెలివైనవారిగా గుర్తిపు పొందుతారు. గుళ్లు, పూజలు అంటూ అత్యంత ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. అంతర్ దృష్టి, అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వీరికి గతంలో కొన్ని ఎదురు దెబ్బలు తగలడం వల్ల.. అప్పుడప్పుడు నిరాశను వ్యక్తం చేస్తారు.

శనివారం – శనివారం నాడు పుట్టిన వారు చాలా నమ్మకంగా ఉంటారు. కొన్ని సార్లు ఎవరికీ అర్ధం కాకుండా ప్రవర్తిస్తారు. అసలు వీరికి సంస్కారం ఉండదా అనే ప్రశ్న ఎదుటివారికి మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో వీరిని ఏది అడిగినా వ్యతిరేకంగా మాట్లాడుతారు. వీరికి గర్వం కాస్త ఎక్కువైనా… ప్రేమని మాత్రం బాధ్యతగా స్వీకరిస్తారు.

ఆదివారం – ఆదివారం పుట్టిన వారు అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం, విశిష్ట లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటిరిగా ఉండటానికే ఇష్టపడతారు. అందంగా, సున్నితమైన మనస్తత్వం కలిగిఉంటారు. అలాంటి వారే ఏ పని చేయడానికైనా ధైర్యంగా ముందుకొస్తారు.

error: Content is protected !!