భోజనానికి ముందు, భోజనం తర్వాత ట్యాబ్‌లెట్స్ ఎందుకు వేసుకోవాలో తెలుసా?

మనకు మందులు ఇస్తూ కొన్ని భోజన సమయానికి ముందు, మరికొన్ని భోజనం చేసిన తర్వాత వేసుకోమని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే మనం తీసుకున్న ఔషధాలు మన శరీరంలో కలవడంలో ఆహారం పాత్ర కీలకమైనది. మందులు రక్తంలోకి ప్రవేశించి కావాల్సిన ప్రదేశానికి చేరుకోవడానికి వేర్వేరు ప్రక్రియలుంటాయి. కొన్ని మందులను తీసుకున్న తర్వాత అవి కడుపులో యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల కడుపులో మంట, నొప్పి ఏర్పడటం, వాంతులు కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇలాంటి మందులను భోజనం తర్వాత తీసుకుంటే వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది.

అవి ఆహారంతో పాటు జీర్ణమై రక్తంలో కలిసిపోతాయి. అలా కాకుండా వెంటనే రక్తంలో కలిసిపోవాల్సిన అవసరం ఉన్నపుడూ, కడుపుపై ఎలాంటి నెగెటివ్‌ ప్రభావం ఉండవనుకున్నప్పుడూ వాటిని భోజనానికి ముందే వేసుకోమని చెప్తారు. అలాగే కొన్ని మందులు పాలు, టీ, కాఫీలతో తీసుకోవద్దని చెప్తారు. ఎందుకంటే ఆ ద్రవాలలోని రసాయన మిశ్రమాలకు, మందులలోని రసాయనాలకు చర్య జరిగి దుష్ఫలితాలు కలిగే అవకాశముంటుంది.

error: Content is protected !!