డయాబెటిస్ కు అద్భుత ఔషదం మామిడి ఆకులు.. ఇలా చేస్తే చాలు

మన దేశం ప్రపంచంలోనే షుగర్ వ్యాధికి రాజధానిగా అవతరించింది. బిజీ లైఫ్, అస్తవ్యస్థమైన ఆహార అలవాట్లు, ఒత్తిళ్లు వెరసి పట్టుమని పాతకేళ్లు నిండకుండానే షుగర్ వ్యాధి వచ్చేస్తోంది. అయితే షుగర్ సోకే ప్రమాదం ఉందన్న విషయం మొదట్లోనే కనిపెట్టొచ్చు. అప్పుడు గనుక జీవన శైలిలో మార్పులు చేసుకుంటే షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇప్పుడు మీరు సహజ సిద్ధంగా షుగర్ వ్యాధిని ప్రారంభంలోనే ఎలా పారదోలవచ్చో తెలుసుకోబోతున్నారు. ఇది చేయడం చాలా సింపుల్.. పైగా పైసా ఖర్చు లేకుండా..

డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు:

* రాత్రివేళ తరుచుగా మూత్రం రావడం, అధికంగా దాహం వేయండి, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, జననేంద్రియాల్లో దురద, దెబ్బ తగిలితే తిరిగి రక్తం గడ్డకట్టడానికి చాలా సమయం పట్టడం, అలసట తదితర సమస్యలన్నీ మధుమేహానికి దారితీస్తాయి.

* కింద చెప్పిన విధంగా చేస్తే మీకు మధుమేహం మీ శరీరానికి ఎటాక్ అయ్యేముందే తరిమికొట్టొచ్చని తాజాగా ఓ పరిశోధన తేల్చింది.. ఎటువంటి లక్షణాలు కనిపించకున్నా కింద చెప్పిన విధంగా చేస్తే ఆ డయాబెటిస్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు..
మామిడి ఆకులతో ఇలా చేయాలి:

* 10-15 మామిడి ఆకులను తీసుకుని వాటిని పూర్తిగా వాష్ చేయాలి. రాత్రివేళ నీళ్లలో వేసి మరిగించాలి. కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రాత్రి అంతా అలాగే నీళ్లలో నాననివ్వాలి.

* ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇలా రెండు నెలల పాటు చేస్తే షుగర్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు..

* కొన్ని ఆకులు తీసుకుని వెలుతురు సోకని, చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఎండిపోయిన తర్వాత వాటిని పొడి చేసుకోవాలి. ఒక టీ స్పూన్ చొప్పున రోజుకు 2సార్లు తీసుకోవాలి.

ఉపయోగాలు:
* చాలా మందికి తెలియని విషయం మామిడి ఆకుల్లో విటమిన్లు, ఎంజైములు ఇతర ఖనిజ, లవణాలు పుష్కలంగా ఉంటాయి.

* ఫలితంగా షుగర్ ఒక్కటే కాదు.. జ్వరం, జలుబు, విరేచనాలు, నిద్రలేమి, నరాల బలహీనత, ఉబ్బసం తదితర ఎన్నో సమస్యలకు ఈ ఆకులు గొప్ప పరిష్కారం..

* రక్తశుద్ది, సరఫరా మెరుగుపర్చడానికి. హార్ట్ డిసీసెస్ నుంచి దూరంగా ఉంచుతాయి.

error: Content is protected !!