Beauty Tips

బాగా నల్లబడుతున్నారా.. ఇలాచేస్తే వెలిగిపోతారు!

Face Glow Tips :కొందరు మంచి రంగు ఉన్నా కొన్ని భాగాల్లో మాత్రం చర్మం నల్లబడుతుంటుంది. ముఖ్యంగా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది స్పష్టం గా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు…చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడు తుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు కూడా వస్తాయి. వీటిని పిగ్మెంటేషన్‌ సమస్య లుగా చెబుతుంటారు.

హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మందుల కారణంగా చర్మం నల్లబడే ప్రమాదం ఉంది. జుట్టుకు రెగ్యులర్ గా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మంటేషన్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

ఇవి సూర్యుడి అతి నీల లోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభదశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం సులభం.

1. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.

2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు తినాలి.

3. బయటకు వెళ్లటానికి 30 నిమిషాల ముందే సన్ క్రీమ్ లోషన్ ముఖానికి రాసుకోవాలి.

4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజు స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకొని ఆ తర్వాత చన్నీళ్లతో స్నానం చేయాలి.

5. కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్ కలిపి మిక్సర్ లో పేస్ట్ గా తయారు చేయాలి. దానిలో సగం చెంచా పాలమీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి
రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుంది.

6. పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని
వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.