ఐశ్వర్యరాయ్ వెంకటేష్ సినిమాను ఎలా మిస్ చేసుకుందో తెలుసా ?

Venkatesh miss Aishwarya Rai :1997 లో వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా కొత్త హీరోయిన్ అంజలా జావేరి నటించింది.

లవ్ ఫ్యాక్షన్ ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది అయితే ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుందని దర్శకుడు అనుకున్నారట. అయితే చిత్ర యూనిట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పట్లో ఆమె నటించిన రెండు మూడు సినిమాలు పెద్దగా అలరించక పోవటంతో ప్లాప్ హీరోయిన్గా ముద్ర పడింది.

దాన్ని సెంటిమెంట్గా భావిం చి చిత్ర బృందం ఐశ్వర్యరాయ్ కి నో చెప్పిందట. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ హిందీ సినిమాల్లో నటించి సూపర్ స్టార్ హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే.