Beauty Tips

బాదంతో ఇలా చేస్తే మెరిసే మృదువైన చర్మం మీ సొంతం

Beauty benefits of almonds :మనలో చాలామంది ఈ బాదం పప్పు తింటే చాలా మంచిదని రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బాదంపప్పు పై తొక్క తీసేసి తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.

అయితే మనకు బాదంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మాత్రమే తెలుసు కానీ Beauty ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి సౌందర్యాన్ని మెరుగు పరచడంలో బాదం చాలా బాగా సహాయపడుతుంది చర్మం కాంతివంతంగా మృదువుగా మారటానికి బాదం ఎలా ఉపయోగించాలి. బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్కతీసి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చర్మంపై ఉన్న మృత కణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది