వేప గింజలలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో ?

Neem Seeds Benefits :మనలో చాలా మందికి వేప చెట్టు నుంచి వచ్చే ఆకులు వేప చిగురు బెరడు, పువ్వు గురించి మాత్రమే తెలుసు కానీ వేప గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది పూర్వ కాలం నుండి మన పూర్వికులు వేప గింజలను వాడుతూ ఉన్నారు. వేప గింజలతో పొడి తయారు చేసుకోవచ్చు వేప గింజల తో నూనెను కూడా తయారు చేస్తూ ఉంటారు వేప గింజలతో పొడి తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ర‌క‌ర‌కాల వైర‌స్‌లు ద‌రిచేర‌కుండా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కడుపులో ఏమైనా నులిపురుగులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

వేప గింజలు గురించి తెలియని ఒక విషయం ఏమిటంటే నాచురల్ బర్త్ కంట్రోల్ గా పనిచేస్తాయి. కాబట్టి వేప గింజలు తీసుకుంటే అవాంఛిత గర్భాన్ని నివారించుకోవచ్చు. కాబట్టి గర్భధారణ సమయంలో వేప గింజల కు చాలా దూరంగా ఉండటం మంచిది. వేప గింజల లో బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వేప గింజల పొడి లో నీటిని కలిపి పేస్టులాగా తయారుచేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు మరియు నల్లటి మచ్చలు తొలగిపోతాయి