డయాబెటిస్ ఉన్నవారు తేనే తినవచ్చా… నమ్మలేని నిజాలు

Honey Good For Diabetes: పంచదార బదులు తేనె వాడితే మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతారు. డయబెటిస్ ఉన్నవారు ఆహారం,జీవనశైలి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయబెటిస్ ఉన్నవారు జంక్ ఫుడ్స్,షుగర్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అసలు డయాబెటిస్ వచ్చిన వారు ఏమి తీసుకోవాలి అనే విషయంలో చాలా మంది గందరగోళంగా ఉంటారు.

అయితే డ్రైఫ్రూట్స్ తినవచ్చని చాలా మంది భావిస్తారు కానీ డ్రై ఫ్రూట్స్ లో షుగర్ కంటెంట్ మరియు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే అందువల్ల డ్రై ఫ్రూట్స్ తినకూడదు. తేనె విషయంలో కూడా ఇదే గందరగోళం వుంది. పంచదారకు బదులు తేనెను వాడటం మంచిది అని నిపుణులు చెపుతారు అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె తీసుకోవచ్చా అనే విషయానికి వచ్చినప్పుడు నిపుణులు చెప్పినదాని ప్రకారం పంచదార బదులు తేనె వాడటం పెద్దగా లాభం ఏమీ ఉండదు. పంచదార కంటే తేనె కాస్త తియ్యగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో వేసుకుంటారు కాబట్టి లోపలికి వెళ్ళే షుగర్ కంటెంట్ తగ్గుతుంది.

అలాగే, తేనె కి పంచదార అంత రిఫైండ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి అది పంచదార కంటే కొంచెం మంచిదే. అయినా కూడా, డయాబెటిక్ పేషెంట్స్ కి మాత్రం ఇది రికమెండ్ చేయలేరు.