కార్తీక మాసం విశిష్టత ఏమిటి…ఈ నియమాలు పాటిస్తున్నారా…?

karthikamasam speciality :కార్తీకమాసం అనేది పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. శివాలయాల్లో భక్తుల సందడి మొదలైంది కార్తీకమాసంలో ఉదయం నిద్ర లేచి చన్నీటితో స్నానం చేసి శివుని ఆరాధించి ఒక పూట భోజనం చేస్తూ ఉంటారు అంతేకాకుండా కార్తీకమాసంలో కార్తీక వనభోజనాలు కూడా జరుగుతాయి. కార్తీకమాసంలో స్నానం దీపం ఉపవాసం ముఖ్యమైనవి.

కార్తీకమాసంలో కార్తీక స్నానం చేసి శివుడు లేదా విష్ణువుని పూజిస్తే సర్వ పాపాలు అన్ని తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే ఈ మాసంలో శివకేశవుల ను పూజించి ఉపవాసం చేస్తే పుణ్యఫలం వస్తుంది. కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది శివాలయంలో లేదా ఇంటిలో సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి ఉసిరిక ఎంతో ప్రీతిపాత్రమైనది కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం.