మిర్చి మూవీ వెనుక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో ?

Mirchi movie Facts :మున్నా సినిమా సమయంలో రైటర్ గా వ్యవహరించిన కొరటాల శివ డైరెక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ వంటి వారికోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ తో సినిమాకు కథ రెడీ చేయమని ప్రభాస్ ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ పేరిట ఓ బ్యానర్ నెలకొల్పి చెప్పారు. దాంతో ప్రభాస్ ని దృష్టిలో ఉంచుకుని 15రోజుల్లో కథ రెడీ చేసాడు శివ ఆ కథ వినిపించడం, దానికి ప్రభాస్ ఒకే చెబుతూ డైలాగ్స్ కొంచెం బలంగా రాయమని చెప్పడంతో కటౌట్ చూసి కొన్ని నమ్మేయ్యాలి వంటి డైలాగ్స్ రాయడంతో ప్రభాస్ ఫిదా అయ్యాడు. అనుష్క హీరోయిన్ , సెకండ్ హీరోయిన్ గా రిచా. ఫాదర్ కోసం కృష్ణం రాజుని అనుకున్నా, రెబెల్ లో చేయడం వలన సత్యరాజ్ ని సెట్ చేసారు. తల్లి కేరక్టర్ కి నదియా ఒకే.

మిగిలిన నటీనటుల సెలక్షన్ పూర్తి. అయితే రెబెల్ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో, వారధి అనే పేరుతొ కొరటాల సినిమా స్టార్ట్ చేసారు. సారధి, అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు పూణేలో కొంతభాగం షూటింగ్ చేసారు. కోకాపేటలో మర్యాదరామన్న కోసం వేసిన సెట్ లో కొంత షూటింగ్ చేసారు. ఈలోగా రెబెల్ షూటింగ్ ఊపందుకోవడంతో వారధి కొంచెం ఆపేసి, 2012ఫిబ్రవరి నుంచి లాస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టారు. సినిమాకు మిర్చి టైటిల్ మార్చాలని అనుకుంటే, దుర్గ ఆర్ట్స్ వాళ్ళు మహేష్ బాబు కోసం రిజిస్టర్డ్ చేసారు. అయితే ప్రభాస్ అడగడంతో ఇచ్చారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. తర్వాత టీజర్ వచ్చేసింది.

బాగా అంచనాలు పెరిగిన ఈ మూవీని 2013సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఆడియో ఫంక్షన్ కి కృష్ణం రాజు, ఎస్ ఎస్ రాజమౌళి గెస్ట్ లుగా వచ్చారు. అయితే సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ సినిమాలు వస్తున్నందున ఫిబ్రవరి 8కి మిర్చి వాయిదా వేశారు. రెబెల్ వంటి సినిమాలు ప్లాప్ కావడం మంచి మాస్ సినిమా పడకపోవడంతో మిర్చి మూవీకి ఫాన్స్ వీరలెవెల్లో హంగామా చేసారు. మూడవరోజుకి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఎలాంటి అనుభవం లేకున్నా సరే, కొరటాల శివ నార్మల్ స్టోరీని స్టైలిష్ గా తీసాడు. వాడి కొడుకు వచ్చాడని చెప్పు లాంటి డైలాగ్స్ విజిల్స్ వేయించాయి. ఈ సినిమాతో యువత ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదిరింది. 28కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ తొలివారం 27కోట్ల షేర్. 28సెంటర్స్ లో 100డేస్. అన్నిచోట్లా రికార్డ్స్ క్రియేట్ చేసి మొత్తం 48కోట్ల షేర్ కలెక్ట్ చేసి, ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది.