భారీగా తగ్గిన బంగారం ధరలు… ఎంతో తెలుసా ?

Today Gold Rate :కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ తర్వాత భారీ స్థాయిలో తగ్గిన ఆ తర్వాత పెరుగుతూ వచ్చాయి. ఈరోజు బంగారం వెండి ధరలు తగ్గాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి పెట్టుబడులు తగ్గటంతో ఈరోజు బంగారం వెండి తగ్గాయని అంటున్నారు. ఢిల్లీ లో 10 గ్రాముల బంగారం ధర రూ.357 తగ్గగా రూ.50,253 పడిపోయింది.అంతేకాకుండా కిలో వెండి ధర రూ.468 తగ్గగా రూ 63,171 కు చేరింది.

మన దేశంలో నే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర తగ్గగా ఔన్స్ 1882 డాలర్లు, వెండి ధర ఔన్స్ 24.57 డాలర్ల కు పడిపోయింది.పసిడి ధరల ప్రభావం తో ప్రపంచ మార్కెట్ లలో మార్పు కనబడుతుంది.