కరోనా సెకండ్ వేవ్ వస్తుందట… మరి లాక్ డౌన్ పెడతారా…?

corona second wave :గత తొమ్మిది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత కలకలం సృష్టించింది మనకు తెలిసిందే దీని కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎన్నో పరిశ్రమలు పారిశ్రామిక రంగాలు నష్టాలు చవి చూశాయి. రెండు నెలలుగా కాస్త ఉదృతం తగ్గిన మరలా వైరస్ పెరుగుతుందని కొన్ని దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన దేశానికి కూడా అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ కి సంబంధించి ఎటువంటి సమాచారం పక్కాగా లేకపోవడంతో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ బెస్ట్ అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

మోడీ సర్కార్ కూడా ఆ ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడం తో విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది దాంతో పాఠశాలలు ముసేయలని ఆలోచిస్తున్నారు. అయితే ఎ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి