బంగాళదుంపకు అధిక బరువుకు లింక్ ఏమిటో తెలుసా ?

weight loss tips in telugu: బంగాళాదుంప అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు బంగాళదుంపతో ఏ కూర చేసినా మంచి రుచిగా ఉంటుంది గ్రేవీ వంటల్లో వేసినా ఫ్రై చేసినా రుచిలో మాత్రం తేడా ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది బంగాళదుంప లో క్యాలరీలు మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనలో చాలా మంది బంగాళదుంప తింటే లావు అవుతావని తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది ఒక అపోహ మాత్రమే బంగాళదుంప తింటే బరువు తగ్గుతార ని నిపుణులు చెబుతున్నారు బంగాళదుంప లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది

దాంతో తీసుకునే ఆహారం తగ్గుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది. బంగాళదుంప లో ఉండే మెగ్నీషియం కాల్షియం కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే బంగాళదుంపను ఉడికించి లిమిట్గా తీసుకుంటే ఈ ప్రయోజనం కనబడుతుంది ఎక్కువగా తీసుకుంటే అలాగే వేపుళ్లు చిప్స్ తీసుకున్నా బరువు పెరిగే ఛాన్స్ ఉంది