Health

తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…

stomach acid gas :తీరికలేని పని ఒత్తిడితో సతమతమయ్యేవారిలో కొందరు ఉన్నట్లుండి భరించలేని కడుపు మంటతో బాధ పడిపోతుంటారు. కడుపులో మొదలైన ఈ మంట క్రమంగా గొంతులోకి తన్నుకు వస్తున్నట్లు బాధ కలుగుతుంది. పైకి మామూలుగానే కనిపించినా కడుపులో తట్టుకోలేని మంట… అగ్నిపర్వతాలు రగులుతున్నాయా? అన్నంత బాధ… కంటి నిండా నిద్ర పట్టదు.. స్థిమితంగా కూర్చోనివ్వదు.. ఇదంతా యాసిడిటి మహిమ.

సాధారణముగా మసాల ఉన్న పదార్దాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం ఉన్న పదార్దాలు తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది. మసాల పదార్ధాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కడుపులో అల్సర్ వ్యాధి వస్తుంది,ఇదే కాలక్రమములో కేన్సర్ గా మారుతుంది.

కడుపులో వచ్చే మంట గ్యాస్ గా మారి అది గుండెల్లొ నొప్పిగా కూడ మారుతుంది. ఈరోజుల్లో రుచికరమైన ఆహారం కావలంటే మసాలాలు ఉండక తప్పట్లేదు,కనుక మసాల stomach acid gas :తీరికలేని పని ఒత్తిడితో సతమతమయ్యేవారిలో కొందరు ఉన్నట్లుండి భరించలేని కడుపు మంటతో బాధ పడిపోతుంటారు. కడుపులో మొదలైన ఈ మంట క్రమంగా గొంతులోకి తన్నుకు వస్తున్నట్లు బాధ కలుగుతుంది. పైకి మామూలుగానే కనిపించినా కడుపులో తట్టుకోలేని మంట… అగ్నిఉన్న ఆహారం తినేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటినుంచి ఉపశమనం పొందవచ్చు.

మసాల ఉన్న ఆహారం తిన్నవెంటనే నీళ్ళు ఎక్కువగా తాగాలి లేదా జీర మజ్జిగ ను తీసుకున్నా సరిపోతుంది.

జీలకర్ర ను బాగా వేయించి పొడి చేసి దానిని నీళ్ళలో కలిపి తాగితే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

పూదీన ఆకులను తీసుకొని నమిలినా లేదా తినే ఆహారంలో దానిని కలిపి తీసుకున్నా ఫలితముంటుంది. ఒక పచ్చడి రుపంలో గాని, పూదీన టీ గాని తీసుకొన్న కొంతవరకు కడుపు మంటను తగ్గించుకోవచ్చు.

మాంసాహారం తిన్నప్పుడు కూడా కడుపులో మంట వస్తుంది. అప్పుడు తిన్న వెంటనే సోడా గాని ఇతర పానియాలు సేవించడం వలన కడుపులో మంట రాకుండా ఉంటుంది.

విందు భోజనాలకు వెళ్ళినపుడు కూడ కడుపులో నొప్పి, మంట వంటివి వస్తాయి. అప్పుడు స్వీట్ పాన్ తీసుకొవడం వలన కడుపులో ఉన్న ఆహారాన్ని అరిగేలా చేయటమే కాక కడుపులో వచ్చే మంట, గ్యాస్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.