ఎన్టీఆర్-వెంకటేష్ మల్టీస్టారర్ ఆగిపోవటానికి కారణం ఎవరో తెలుసా ?

NTR And Venkatesh :విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు పౌరాణిక చిత్రాలతో పాటు సాంఘిక చిత్రాల్లో కూడా తన సత్తా చాటి ఆశేష ఆంధ్ర ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. అయితే ఈయనతో విక్టరీ వెంకటేష్ కల్సి ఓ సినిమా చేయడానికి అప్పట్లో ఓ ప్లాన్ వేసారట. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు.

కానీ ప్రస్తుతం వెంకీ మామ, ఎఫ్ 2, గోపాల గోపాల ఇలా పలు మల్టీస్టారర్ మూవీస్ చేయడమే కాకుండా ఇంకా మల్టీస్టారర్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ తో కల్సి చేయాలన్న కోరిక తీరలేదు. గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీని వెంకీతో కల్సి ఎన్టీఆర్ చేయాలనుకున్నారట. శాతకర్ణి కొడుకు పాత్రకు వెంకీని అనుకున్నారట.

శ్రీనాధ కవిసార్వభౌమ మూవీ కి ముందే గౌతమీ పుత్ర శాతకర్ణి కథ రెడీ చేయించారట. వెంకీ కూడా ఆనంద పడ్డాడట. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా సెట్స్ మీదికి రాకుండానే ఆగిపోయింది. అయితే ఇటీవల క్రిష్ ఇదే సినిమాను బాలయ్యతో తీసిన సంగతి తెల్సిందే. అయితే ఎన్టీఆర్ తో కల్సి నటించాలనుకున్నప్పటికీ వెంకీకి కుదరకపోవడంతో కలిసుందాంరా మూవీలో నచ్చావే పాలపిట్ట సాంగ్ లో ఎన్టీఆర్ యానిమేషన్ పక్కన నటించి తన కోరిక తీర్చుకున్నాడు.