మల్లె టీ త్రాగితే….జరిగే అద్భుతం తెలిస్తే…షాక్

Jasmine tea benefits :అది ఇంటి వైద్యం అనండి. సొంత వైద్యం అనండి.. పెద్దలు చెప్పిందని అనండీ ఏది అయినప్పటికీ మనకు ప్రకృతిలో దొరికే ఫల పుష్పాదులతో కొన్ని రకాల వ్యాధులు నయం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మల్లి పూవు. మల్లె పూలు పెట్టుకుని, తెల్ల చీర కట్టుకుంటే ఆ లుక్కే వేరు అంటారు కదా. కానీ మల్లె చాలా రోగాలకు కూడా పనిచేస్తుందని అంటారు. రాత్రివేళల్లో ఓ కప్పు మల్లె టీ సేవిస్తే, సుఖ నిద్రకు మార్గం ఏర్పుడుతుందట.

నిద్ర మధ్యలో ఎలాంటి కలత ఉండదని కూడా అంటారు. ముఖ్యంగా జలుబు, జ్వరం గుణాలను నివారించే శక్తి మల్లెకు ఉందట. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

మల్లె పరిమళం, గుబాళింపు అంతా ఇంతాకాదు. అందుకే మల్లె పరిమళం వత్తిడిని దూరం చేస్తుందట.

ఎక్కువ పనులతో అలసిపోతే, మల్లె నూనె వాసన పీలిస్తే చాలు అలసట ఆమడ దూరం పోతుందట.

మల్లె నూనె చర్మానికి తేమను అందించి, రక్షణ ఇస్తుంది.

చర్మం పొడిబారే విధానాన్ని మల్లె నూనె నివారిస్తుంది.

మల్లె నూనె చర్మం సాగే గుణాన్ని పెంచడంతో పాటు, చర్మంపై మచ్చలను కూడా నిరోధిస్తుందట.