డిసెంబర్ 3rd గురువారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి

astrology Telugu Dec 3rd :మేష రాశి ఈ రాశివారు ఉద్యోగమైనా వ్యాపారమైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఖాళీ సమయంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. పార్వతి దేవి మంగళ స్తోత్రం చదివితే ఆనందకరమైన కుటుంబ జీవితం ఉంటుంది

వృషభ రాశి
ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొత్త వారిని నమ్మకూడదు జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం సూర్యకాంతిలో పది నిమిషాలు ఉండాలి

మిధున రాశి
ఇంట్లో సమస్యలు ఉండవచ్చు ఈరోజు కొన్ని ఇబ్బందులు జీవిత భాగస్వామి ద్వారా రావచ్చు మీ జీవితం సంతోషకరంగా ఉండాలి అంటే శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.

కర్కాటక రాశి
ఆర్థికంగా చాలా బాగుంటుంది ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వస్తుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి ఆనందంగా ఉంటారు. పని వారికి ఆహార పదార్థాలు దానం చేస్తే వృత్తిలో లాభాలు వస్తాయి.

సింహరాశి
ఈ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు. పదిమందిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి గంగాజలంతో శివారాధన చేయండి దీని కారణంగా ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది.

కన్యారాశి
డబ్బు ని ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కాస్త ఇబ్బందుల్లో పడతారు మీరు కాస్త డబ్బు విషయంలో శ్రద్ధ పెట్టాలి. జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. లక్ష్మీ నరసింహ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది.

తులారాశి
స్నేహితులతో కలిసి చేసే పనులు కలిసి వస్తాయి మీ ఆలోచనలు అన్నీ బాగుంటాయి సమయం వృధా అయిందని కాస్త బాధ పడతారు వైవాహిక జీవితం బాగుంటుంది ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఆరోగ్యానికి మంచిది

వృశ్చిక రాశి
చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అనుకోని శుభవార్త వింటారు సంఘంలో ఒక గౌరవం గుర్తింపు పొందుతారు గణపతి ఆరాధన చేస్తే మంచిది.

ధనుస్సు రాశి
ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది నీకు ఆఫీసులో నమ్మకద్రోహం చేస్తారు దానితో రోజంతా కలతగా ఉంటారు శ్రీ లక్ష్మీ ఆరాధన చేస్తే మంచిది.

మకర రాశి
ఇంటిలో పరిస్థితిలో కొంచెం ప్రశాంతంగా ఉంటాయి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలి సమయాన్ని వృధా చేయకూడదు ఖర్చులు తగ్గించుకోవాలి తులసి ఆకులు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభరాశి
ఎంత డబ్బు సంపాదించినా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే మంచిది.

మీన రాశి
డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు నిరోధాలను సృష్టిస్తుంది వ్యాపారం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి సూర్యనమస్కారాలు చేయండి.మీ రాశి ప్రకారం ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం మీ ఆలోచనలు ఉండేలా చూసుకోండి. అయితే ఇది ఒక అవగాహన కోసం మాత్రమే .