ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా…ఆలస్యం చేయకుండా చూసేయండి

Sharwanand childhood pics:సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు, ప్రముఖులు బాగా వినియోగిస్తున్నారు. వారు పెట్టె పోస్టులు, లైక్ లు లక్షలు ,కోట్లకు చేరుతున్నాయి. ఇక కొత్తగా ఏదైనా పోస్టు పెడితే చాలు, వెంటనే వైరల్ అవుతుంది. ఇప్పుడు హీరో శర్వానంద్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం శ్రీకారం అనే మూవీలో నటిస్తున్న శర్వానంద్ తక్కువ టైం లోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరోగా నిలిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో చూస్తే, చిన్నప్పుడు శర్వా ఎలా ఉన్నాడో కూడా తెలుసుకునే ఛాన్స్ వచ్చింది. అందుకే ఫాన్స్ షేర్ చేస్తున్నారు.

తెలుగు వాడైనా మొదట్లో తమిళ మూవీలో నటించిన శర్వానంద్ ఆతర్వాత టాలీవుడ్ లోకి వచ్చాడు. ప్రముఖ డైరెక్టర్ జయరాజ్ తెరకెక్కించిన యువసేన మూవీ లో నటించి, మెల్లిగా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు.