మన కలలోకి కుటుంబ సభ్యులు వస్తే ఏమవుతుంది

family members in dream : మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తే అదే మన కలలోకి వస్తుంది. అది కలలోకి వస్తే కచ్చితంగా జరుగుతుందని భావించే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక విషయం గురించి కాకుండా మీ కుటుంబసభ్యుల్లో ఎవరెవరు మీ కలలోకి వస్తే ఏమేం జరుగుతుందో మీకు తెలుసా?

మన పూర్వీకుల నుంచి ప్రచారంలో ఉన్న ఆచారం ప్రకారం.. మన కుటుంబసభ్యుల్లో ఏ వ్యక్తి వస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఒకసారి చూద్దాం..

1. కలలో తల్లిద్రండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారు.
2. కలలో అత్త చనిపోయినట్లు వస్తే అధిక ధనలాభం కలుగుతుందట.
3. కలలో సోదరుడు కనిపిస్తే గౌరవం, కీర్తి లభిస్తుంది.
4. కలలో అన్నదమ్ములు డబ్బులిచ్చినట్లు జరిగితే ధనలాభం చేకూరుతుంది.
5.స్త్రీలకు కలలో భర్త కనిపిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. భర్త కలలో కనిపిస్తే ఆ స్త్రీ పసుపు కుంకుమలతో, సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని పండితులు అంటున్నారు.
6.కలలో తమ్ముడు కనిపిస్తే పెద్దలని గౌరవిస్తారు.
7.కలలో అన్న-వదిన కనబడితే ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ఇంకా సుఖసంతోషాలు మీ ముంగిట్లో ఉంటాయి.
8.భర్తకి భార్య కలలో కనిపిస్తే ధనలాభము, ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.