F 3 భారీ రెమ్యునరేషన్స్ …దీనిలో నిజం ఎంత…?

F3 movie remunerations :అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్ 2బ్లాక్ బస్టర్ కావడంతో ఎఫ్ 3తీయాలని అప్పుడే ప్లాన్ చేసారు. కానీ కరోనా ఎఫెక్ట్ వలన కుదరలేదు. తాజాగా ఎఫ్ 3 మూవీ 2021 లో సెట్స్ మీదికి వస్తోందని తెలిసాక , మూవీ గురించి ప్రతిదీ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు దాదాపు 70రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేయగా, ప్రమోషన్ ఖర్చులు కలిపి మొత్తం 80 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేసారట.

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంటె, ఇంతపెద్ద బడ్జెట్ అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు తమన్నా, మెహ్రిన్ కూడా నటిస్తున్నారు. వీళ్ళ రెమ్యునరేషన్ గురించి జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ కి 12 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తుంటే, వరుణ్ తేజ్ కి 8 కోట్ల వరకూ ముట్టజెబుతున్నారని టాక్. హీరోలతో దిల్ రాజు కు ఒప్పందం కూడా అయిందట.

హీరోలిద్దరినీ పక్కన పెడితే, తమన్నాకు 2 కోట్లు.. మెహ్రీన్ కు 70 లక్షలు, సునీల్ కు75 లక్షలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి రూ .3 కోట్లు ఇవ్వడానికి ఒకే అయినట్లు ప్రచారం సాగుతోంది. ఇక దర్శకుడు అనిల్ రావిపుడికి రూ .12 కోట్లు ఒప్పందం చేసుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. నటులు వెన్నెల కిషోర్ – శ్రీనివాస్ రెడ్డి ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా ఎక్కువేనట. కేవలం రెమ్యునరేషన్ల రూపంలోనే ఈ మూవీ కోసం 50 కోట్లు వెచ్చిస్తున్నట్లు టాక్. ఇది ఎంతవరకూ నిజమో క్లారిటీ రావాల్సి ఉంది.