MoviesTollywood news in telugu

తెలుగు వీర లేవరా సినిమా వెనుక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో…అసలు నమ్మలేరు

Telugu Veera Levara Full Movie :తేనెమనసులు మూవీ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ తన నటనతో సూపర్ స్టార్ అయ్యాడు. వందవ చిత్రంగా అల్లూరి సీతారామరాజు మూవీ తీసి, తెల్లదొరలపై అల్లూరి తెగువ, పౌరుషాగ్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.

ఇక స్వాతంత్య్రం వచ్చిన దొరతనపు ఛాయలు పోలేదని, దొరతనాన్ని ప్రశ్నిస్తూ, 200వ చిత్రంగా ఈనాడు తీసి విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు అందుకున్న ఘనవిజయాలు దృష్టిలో ఉంచుకుని, అప్పటి సామాజిక నేపథ్యంతో 300వ చిత్రంగా తెలుగు వీర లేవరా మూవీ తీశారు. అయితే 300వ చిత్రం డిజాస్టర్ అయింది.

నిజానికి మన్నెంలో రామారాజు పేరుతొ పరుచూరి బ్రదర్స్ ఓ పవర్ ఫుల్ అంశంతో కథ రెడీ చేసారు. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇక 300వ చిత్రం కోసం కథలో మార్పులు చేయించి, పరుచూరి సోదరులతో కృష్ణ స్క్రిప్ట్ రెడీ చేయించాడు. ఈ సినిమా డైరెక్షన్ కోసం చాలా పేరు తెరమీదికి వచ్చాయి.

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ చేయబోతున్నట్లు కృష్ణ ప్రకటించడంతో మరింత క్రేజ్ వచ్చింది. అయితే మనిషా సంస్థలో కృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే ఓ మూవీ చేయడానికి కృష్ణ ఒకే చెప్పడంతో ప్లాన్ మారింది. ఇక వజ్రాయుధం తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మూవీ రాలేదు. దాంతో 300వ చిత్రానికి డైరెక్షన్ చేయమని అడిగితె, అటు ఇటు అయితే నీ ఫాన్స్ తో తట్టుకోవడం కష్టం, అయినా నువ్వే డైరెక్టర్ గా కూడా మారావు కదా నువ్వే చేసెయ్యి అని రాఘవేంద్రరావు చెప్పారు.

చివరకు ఈవీవీ సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. అప్పటికే వారసుడు మూవీ చేసిన ఈవివికి కృష్ణ ఫాన్స్ బలమేమిటో తెలుసు.అందుకే ఛాలెంజ్ గా తీసుకుని ఈవీవీ వర్క్ చేసాడు. 1995ఫిబ్రవరి 24న అశేష అభిమానుల సమక్షంలో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఈ మూవీ ఓపెనింగ్. పైగా కొంతకాలంగా విభేదాలతో దూరంగా ఉన్న ఎన్టీఆర్, అక్కినేని ఈ కార్యక్రమానికి కలసికట్టుగా వచ్చారు.

లక్ష్మీపార్వతి కెమెరా స్విచాన్ చేయగా, అక్కినేని తొలిక్లాప్ ఇచ్చారు. ఎన్టీఆర్ తొలిషాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. అల్లూరి సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా గీతాన్ని రాసారు. అదే ఈ మూవీకి టైటిల్ అయింది. ఇక అల్లూరి మూవీలో నటించిన రాజనాల ఈ సినిమాలో కూడా అదే పాత్ర పోషించారు.

పెద్ద పెద్ద డైలాగులు చెప్పడంలో దిట్ట కావడంతో అలాంటి డైలాగులు పెట్టారు. అయితే సినిమా రిలీజ్ టైం కి పొడిపొడి డైలాగుల ట్రెండ్ వచ్చేసింది. దాంతో సినిమా రిలీజ్ అయ్యాక ఫాన్స్ సైతం పెదవి విరిచారు. అయితే సినిమా అపజయాన్ని అంగీకరించే నైజం కృష్ణకు ఉండడం వలన ఈ సినిమా డిజాస్టర్ ని అంగీకరించారు.