MoviesTollywood news in telugu

ముగ్గురు మొనగాళ్లు మూవీ ఆగిపోడానికి కారణం ఆ హీరోనా…!

Tollywood Heroes :తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ బీరం లీలా వరప్రసాద్ అలియాస్ బిఎల్వి ప్రసాద్ గుడివాడ వాసి. రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఇంటికోడలు మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అభిమానవతి మూవీ సమయంలో డూండి దగ్గర బిఎల్వి ప్రసాద్ చేరాడు.

అక్కడ నుంచి కృష్ణ నటించిన దొంగలకు దొంగ, దొంగలకు సవాల్, వంటి పలు మూవీస్ కి కో డైరెక్టర్ గా చేసి, కృష్ణకు దగ్గరయ్యాడు. అలాగే శోభన్ బాబుతో ఎంకి నాయుడు బావ వంటి మూవీస్ కి పనిచేసి ఆయనకు దగ్గరయ్యాడు. ఇక డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడానికి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఆసక్తి చూపారు.

అయితే హీరో కృష్ణతో మొదటి సినిమా చేయాలన్న కోరిక వలన తమ్మారెడ్డి భరద్వాజ, రామకృష్ణారెడ్డి కూడా నిర్మాతలుగా ఛాన్స్ ఇచ్చారు. ఈలోగా సుందర్ లాల్ నహతా వచ్చి, మోహన్ బాబు చేసిన గృహప్రవేశం మూవీని తమిళంలో డైరెక్ట్ చేయమని అడగడంతో కాదనలేక తమిళ సినిమాతో డైరెక్టర్ గా ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక శోభన్ బాబు, కృష్ణంరాజు లను కూడా కల్పి ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు తనతో మల్టీస్టారర్ మూవీ చేయాలని కృష్ణ సలహా ఇవ్వడంతో ప్రసాద్ కి కూడా నచ్చింది. వాళ్ళను సంప్రదించగా ఒకే చెప్పడంతో ముగ్గురు మొనగాళ్లు టైటిల్ నిర్ణయించి పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చారు. అంతవరకూ ఈ మగ్గురు కల్సి ఏ సినిమా చేయలేదు.

దాంతో ఇండస్ట్రీలో సంచలనం అయింది. ముగ్గురు హీరోల ఇమేజ్ కి తగ్గ కథ తయారు ఆలస్యం కావడంతో కృష్ణంరాజుతో ఓ సినిమా చేయమని ప్రొడ్యూసర్ సారధి అడిగారు. బలవంతంగా ప్రకటన కూడా ఇచ్చేయడంతో నిర్మాత రామకృష్ణారెడ్డి వెంటనే ప్రసాద్ ని వెంటబెట్టుకుని శోభన్ బాబు దగ్గరకు వెళ్లారు.

ఏరా అని పరిచయం ఉండడంతో ఏరా ప్రసాదం తనతో చేయమంటే, ముందుగా కృష్ణతో అని చెప్పి, ఇప్పుడు కృష్ణంరాజుకు ఎలా ఒప్పుకున్నావ్ అని అడిగారు. సరేలేగాని రామకృష్ణారెడ్డి తనతో సోలోగా తీసే సినిమా చెయ్యి అని ఆర్డర్ వేశారు. ఇక అదే సమయంలో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండడంతో ఉమ్మడిగా కాదు కదా, విడివిడిగా తీసే ఛాన్స్ కూడా పోయింది.

దాంతో మోహన్ బాబు తో రామకృష్ణారెడ్డి నిర్మించే మాయగాడు మూవీ ని ప్రసాద్ చేయాల్సి వచ్చింది. ఇక ముగ్గురు మొనగాళ్లు కూడా ఆగిపోయింది. ఫాన్స్ కూడా నిరాశ చెందారు. అయితే ఈ ముగ్గురు కురుక్షేత్రంలో కనిపించడంతో ఫాన్స్ కి కొంత సంతృప్తి కల్గింది.