Healthhealth tips in telugu

బెల్లం స్వచ్ఛమైనదా లేదా కల్తీ జరిగిందా… ఇలా తెలుసుకోండి

jaggery benefits in telugu : ఈ రోజుల్లో అది తింటే మంచిది కాదు ఇవి తింటే మంచిది కాదు అని చెప్పటం ఎక్కువైపోయింది. ఒకప్పుడు పంచదార ఎక్కువగా వాడేవారు. పంచదార తీసుకుంటే ఎక్కువ సమస్యలు వస్తాయని ఈ మధ్యకాలంలో బెల్లం వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బెల్లం ఎక్కువగా వాడుతున్నారు.
Jaggery Health Benefits in Telugu
అయితే బెల్లం లో కూడా కల్తీ ప్రారంభం అయిపోయింది. బెల్లం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బెల్లంలో సోడియం కార్బనేట్ బరువు కోసం,సోడియం బై కార్బనేట్ రంగు కోసం కలుపుతూ ఉంటారు. ఈ రసాయనాలు కలిపిన 24 గంటలకు బెల్లం ఎరుపు, తెలుపు,పసుపు రంగులలోకి మారుతుంది.

కాబట్టి ఎటువంటి బెల్లంను కొనుగోలు చేయకుండా ముదురు రంగు అంటే గోదుమ రంగులో ఉండే బెల్లాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు చెప్పుతున్నారు. బెల్లం చెరుకు తో తయారు చేస్తారు.ఇలా తయారు చేసే తరుణంలో చెరుకు వేడికి బాగా మరిగి ముదురు ఎరుపు రంగు లోకి వస్తాయి.ఇలా ముదురు ఎరుపు రంగులోకి మారిన బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.

బెల్లం స్వచ్చమైనదా లేదా కల్తీ జరిగిందా అనే విషయం తెలుసుకోవాలంటే కొంచెం బెల్లాన్ని ఒక గ్లాస్ నీటిలో వేస్తే కల్తీ అయితే ఆ పదార్ధాలు నీటి అడుగుకు వెళ్లిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.