MoviesTollywood news in telugu

రైతు భారతం సినిమా గురించి ఎవరికి తెలియని నిజాలు…అసలు నమ్మలేరు

Raithu bharatam telugu full movie :దేశానికి రైతే వెన్నెముక అనే నినాదం నినాదంగానే ఉంటోంది. శ్రమించిన రైతుకు తగిన ఫలితం రావడంలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు పరిస్థితి మాత్రం మారడం లేదు. ఫ్యాక్టరీలో ఏది ఉత్పత్తి చేసినా దాని రేటు యజమాని నిర్ణయిస్తాడు. కానీ తాను పండించిన పంటకు రైతుకి గిట్టుబాటు ధర కూడా రాని దుస్థితి నెలకొంది.

గతంలో రైతు సమస్యల మీద మూవీస్ కూడా వచ్చాయి. అందులో ముఖ్యంగా రైతు తన పరిస్థితిని తానే చక్కదిద్దుకోవాలన్న రీతిలో తీసిన సినిమా రైతు భారతం. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి తనయుడు శ్రీప్రసాద్ డైరెక్షన్ చేసాడు.
కృష్ణ సినిమాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పాకాలలో 1992ఏప్రియల్ 9న షూటింగ్ ప్రారంభమైంది.

కృష్ణ, కృష్ణంరాజు, భానుచందర్ కాంబినేషన్ లో ఈ సినిమా తీయాలని మొదట్లో అనుకున్నారట. రైతు ప్రతినిధిగా కృష్ణ, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కృష్ణంరాజు, యాక్షన్ హీరోగా భానుచందర్ అనుకున్నారు. వాసూరావు సంగీత దర్శకత్వంలో మహారథి, సీతారామశాస్త్రి రాసిన గీతాలను రికార్డు కూడా చేసారు.

సినిమా స్టార్ట్ అయ్యాక సినిమా పరిశ్రమలో సమ్మె, తర్వాత గ్యాప్ కారణంగా రెండేళ్లు ఆగింది. దానికి తోడు, కృష్ణ ,కృష్ణంరాజు లకు మార్కెట్ పడిపోయింది. అదే సమయంలో పచ్చని సంసారం మూవీతో కృష్ణకు పూర్వ వైభవం రావడంతో షూటింగ్ స్టార్ట్ చేసారు. అయితే కథలో మార్పు చేసి, కృష్ణంరాజు పాత్ర తొలగించారు.

కృష్ణ, భానుచందర్ అన్నదమ్ములుగా, తులసి చెల్లెలుగా కథ లో మార్పులు చేశారు. రైతు శ్రమను దోచుకునే వ్యవస్థపై తిరుగుబాటు చేసే రైతు ప్రతినిధిగా ఎమోషనల్ గా కృష్ణ పాత్ర నడుస్తుంది. ఆనాటి ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన డంకెల్ ప్రతిపాదనల ను వ్యతిరేకించడం ఈ మూవీ స్పెషల్. రైతు పాత్రలు కృష్ణకు కొట్టినపిండి కావడంతో బాగా ఒదిగిపోయారు. మహారథి రాసిన రైతన్న లేవరా సాంగ్ ని తెనాలి వీధుల్లో షూట్ చేసారు.

కృష్ణ సరసన వాణి విశ్వనాధ్ నటించిన ఏకైక మూవీ ఇదే. ఇక అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన సౌందర్యకు ఇది తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా జాప్యం కారణంగా తర్వాత నటించిన మనవరాలి పెళ్లి మూవీ ముందుగా రావడంతో సౌందర్య తొలిచిత్రం అదే అయింది. డైరెక్టర్ శోభన్, కెమెరామెన్ రసూల్ కి ఇదే మొదటి మూవీ. 1994 మార్చి 2న రిలీజైన ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.