ఇండస్ట్రీ హిట్ సినిమాల గురించి కొన్ని నమ్మలేని నిజాలు

Industry hit movies :ఏదైనా సినిమా డిజాస్టర్ ఏవరేజ్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఈజీగా తెలిసిపోతాయి. కానీ ఇండస్టీ హిట్ అనేది ఎలా నిర్ణయిస్తారన్నది చాలామందికి తెలీదు. ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడమా, ఎక్కువ థియేటర్లలో ఆడడమా వంటి ప్రశ్నలు వస్తుంటాయి. అయితే గతంలో సెంటర్స్ ని బట్టి ఇండస్ట్రీ హిట్ రికార్డు చేసేవారు. 1963వరకూ అలా రికార్డ్ చేస్తూ వచ్చినా, ఆతర్వాత నుంచి ఎక్కువ కలెక్షన్స్ తెస్తే చాలు ,సెంటర్స్ తో పనిలేకుండా ఇండస్ట్రీ హిట్ గా లెక్కిస్తున్నారు. 1963లో లవకుశ 26సెంటర్స్ లో 100రోజులు ప్రదర్శితమై, చివరి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.:

దీన్ని క్రాస్ చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. 1971లో దసరా బుల్లోడు, 1974లో అల్లూరి సీతారామరాజు ఈ రెండు సినిమాలు లవకుశ థియేటర్స్ ని క్రాస్ చేయకపోయినా కలెక్షన్స్ దుమ్మురేపాయి. అయితే 1973లో దేవుడు చేసిన మనుషులు ఒక్క సెంటర్ తో క్రాస్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రమే నిల్చింది. 1977లో అడవిరాముడు 30సెంటర్స్ లో 100రోజులు ప్రదర్శితమై బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది. 1981లో ప్రేమాభిషేకం కలెక్షన్స్ పరంగా దీన్ని క్రాస్ చేసినా, సెంటర్స్ పరంగా క్రాస్ చేయలేదు. అయినా అద్భుత ఇండస్ట్రీ హిట్ గా మిగిలింది. ఇక కొండవీటి సింహం మూవీ అడవిరాముడు సెంటర్స్ ని అదనంగా ఒక సెంటర్ క్రాస్ చేసినా, ప్రేమాభిషేకం కలెక్షన్స్ ని క్రాస్ చేయలేదు. దాంతో బ్లాక్ బస్టర్.

స్లాబ్ సిస్టం రాకముందు ఇలా రికార్డ్స్ ఉండగా, స్లాబ్ సిస్టం వచ్చాక 1989లో ముద్దులమావయ్య 28సెంటర్స్ లో 100రోజులు ఆడి , ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అదే ఏడాది శివ మూవీ క్రాస్ చేసి, ఇండస్ట్రీ హిట్ అయింది. అయితే సెంటర్స్ క్రాస్ అవ్వలేదు. 1997లో హిట్లర్ మూవీ 42సెంటర్స్ లో 100రోజులు ప్రదర్శితమై సూపర్ హిట్ అయింది. అదే ఏడాది ప్రేమించుకుందాం రా 52సెంటర్స్ లో 100డేస్ ఆడి రికార్డ్ క్రియేట్ చేసినా, ఇండస్ట్రీ హిట్ కాదు. 1998లో చూడాలని ఉంది 63సెంటర్స్ లో 100డేస్ ఆడి, బ్లాక్ బస్టరయింది. 2000లో నువ్వే కావాలి మూవీ సమరసింహా రెడ్డి షేర్స్ ని క్రాస్ చేసి, సెంటర్స్ పరంగా సగం కూడా లేకున్నా ఇండస్ట్రీ హిట్ అయింది.

2003లో సింహాద్రి 150సెంటర్స్ లో 100డేస్ ఆడడంతో , ఇంద్రను క్రాస్ చేయకపోవడంతో బిగ్గెస్ట్ హిట్ అయింది. 2006లో పోకిరి మూవీ కూడా ఠాగూర్ సెంటర్స్ ని క్రాస్ చేయకపోయినా, భారీ కలెక్షన్స్ తో అధిగమించి ఇండస్ట్రీ హిట్ అయింది. 2017లో అత్తారింటికి దారేది మూవీ మగధీర కలెక్షన్స్ ని క్రాస్ చేసి న్యూ ఇండస్ట్రీ హిట్ అయింది కానీ, మగధీర సెంటర్స్ కి దగ్గరగా కూడా రాలేదు. ఇక అప్పటినుంచి కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీ హిట్ చూస్తున్నారు. దీన్ని బట్టి, సెంటర్స్ కాకుండా కలెక్షన్స్ పరంగానే ఇండస్ట్రీ హిట్ నిర్ణయిస్తారని తేలింది.