లవ్ స్టోరీ క్లైమాక్స్…చైతన్య రిస్క్ తీసుకుంటున్నాడా…?

Love story naga chaitanya :హ్యాపీ డేస్ మూవీతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన లీడర్ లాంటి సినిమాలు టాప్ లెవెల్లోనే క్లిక్ అయ్యాయి. ఇక ఫిదా మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు నాగచైతన్యతో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తీస్తున్నాడు. దీనిపై అంచనాలు భారీగా ఉండడమే కాదు, కొన్ని అనుమానాలు వస్తున్నాయి.

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న ఈమూవీలో క్లైమాక్స్ ట్రాజెడీ గా ఉంటుందని టాక్. అయితే ఇలాంటి సమయంలో నాగచైతన్య రిస్క్ తీసుకుంటున్నాడా ఏమిటి అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఫిదా హీరోయిన్ సాయిపల్లవి ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్ అనగానే ఓ క్రేజ్ ఉంటుంది.

పైగా అక్కినేని వారి అబ్బాయి కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న థాంక్యూ మూవీలో కూడా సాయిపల్లవి నటిస్తోంది. వచ్చే ఏడాది సాయిపల్లవి మూవీస్ మూడు గానీ, నాలుగు కానీ రిలీజ్ కావచ్చు. దీంతో ఎలా చూసినా సాయిపల్లవి సేఫ్ జోన్ లో ఉందని, నాగ చైతన్య ట్రాజెడీతో వస్తే ఎలా ఉంటుందోనని టాక్. అయితే సినిమా క్లైమాక్స్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ అధికారికంగా రాలేదు.