చపాతీలు మెత్తగా,మృదువుగా ఉండాలంటే….చిట్కా

Cooking tips In telugu :చపాతీలు మెత్తగా,మృదువుగా ఉండాలంటే…పిండిని వేడి నీటితో కలపాలి. అలాగే అర స్పూన్ పంచదార కలిపితే చపాతీ మెత్తగా మృదువుగా రుచిగా ఉంటాయి.

బాదం పప్పును 15 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెడితే పొట్టు సులభంగా వస్తుంది.

రాగి చెంబులను శుభ్రం చేయటానికి ఉప్పు,నిమ్మరసం ఉపయోగించాలి.

బిస్కెట్ ల డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ ని ఉంచితే బిస్కెట్స్ మెత్తపడవు.

కూరలో కాస్త ఉప్పు ఎక్కువైతే కొంచెం బియ్యం పిండి కలిపితే సరిపోతుంది.

బంగాళదుంప చిప్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులను వేయాలి.

ఎండుమిరప కాయలు ఎక్కువ రోజులు ఎర్రగా ఉండాలంటే ఉప్పు,కొద్దిగా వంట నూనె కలపాలి.