Healthhealth tips in telugu

ఈ చెట్టును అందరూ చూసే ఉంటారు కానీ దీని గురించి ఎవరికీ తెలియదు

Talambralu chettu Benefits :మన ఇంటి చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి అయితే మనం వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాం వాటిలో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు రోడ్డు పక్కన పొలాల గట్ల మీద ఎక్కడపడితే అక్కడ కనిపించే తలంబ్రాలు మొక్క గురించి తెలుసుకోండి ఈ మొక్కను మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం గ్రామాలలో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. చెరువు కట్టలు, పిల్ల కాలువల పక్క గానీ ఆ కాలువలో ఇరువైపులా మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ మొక్క గురించి మనకు పెద్దగా ఏమీ తెలీదు. గ్రామాల్లో ఉండేవారికి ఈ మొక్క గురించి బాగా తెలుసు. వాళ్ళు ఈ మొక్కను ఎదో రకంగా రోజు వాడుతూనే ఉంటారు. ఈరోజు వివరంగా తెలుసుకుందాం. వెర్బినేసి కుటుంబానికి చెందిన తలంబ్రాల చెట్టు ఒక పొద. దీనిలో దాదాపుగా 150 జాతులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు చర్మ సమస్యలను తగ్గించటంలో చాల ప్రభావవంతంగా పనిచేస్తుంది. గజ్జి,తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు ముఖ్యంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఒకప్పుడు 6o ఏళ్ళు వచ్చాక మోకాళ్ళ నొప్పులు వచ్చేయి ఇప్పుడు చిన్న వయసులో రావడానికి మారిపోయిన జీవనశైలి ఆహారపు అలవాట్లు ఒత్తిడి అధిక బరువు వంటి సమస్యల కారణంగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.మోకాళ్ళ నొప్పులు రాగానే చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వవచ్చు. మన చుట్టూ ఉన్న మొక్కలతోనే ఈ నొప్పి నుండి ఉపశమనం కలిగించుకునే ప్రయత్నం చేయవచ్చు తలంబ్రాల చెట్టు ఆకులు బాగా సహాయపడుతాయి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు.ఆకులను ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పైపూతగా రాసి ఒక క్లాత్ తో గట్టిగా కట్టాలి. ఇలా రాత్రి పడుకోవడానికి ముందు చేయాలి ఈ విధంగా నెలరోజులపాటు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వెన్నునొప్పి, రుమాటిజం మరియు కండరాల నొప్పులు ఇలా అన్ని రకాల నుండి నొప్పుల ఉపశమనం కలుగుతుంది.