వేపాకులతో ఇలా చేస్తే డయాబెటిస్ కి చెక్ పెట్టొచ్చు
Diabetes tips in telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే జీవితాంతం మందులు వాడాల్సిందే ఈ వ్యాధి వచ్చినప్పుడు మనిషిని శారీరకంగానూ మానసికంగానూ ఇబ్బంది పెడుతుంది. డయాబెటిస్ వచ్చింది అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
వేప డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే వేప ఆకులను ఎలా తీసుకోవాలి అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. వేపాకులను శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో రెండు చిటికెల పొడిని వేసి బాగా కలిపి పరగడుపున తాగాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారే కాకుండా ఎవరైనా వేపాకుల పొడి తీసుకోవచ్చు.
వేప ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, గ్లైకోసైడ్లు, ట్రైటెర్పెనాయిడ్, ఫ్లేవనాయిడ్ల వంటి సమ్మేళనాలు ఉంటాయి.ఇవి గ్లూకోజ్ పెరుగుదలను తగ్గించి. మధుమేహం వ్యాధిని నియంత్రిస్తాయి. వేపాకులలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది.