ఆహా ఓటిటి పక్కా ప్లాన్ తో నడుస్తోందా…ఎంత ఖర్చు పెట్టారో…?

telugu ott aha budget and income :వ్యాపారం అంటేనే లాభంతో ముడిపడి ఉంటుంది. అందునా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా ముందుచూపుతో పెట్టుబడులు పెడుతుంటాడు. కరోనాకి ముందు కొన్ని ఓటిటి సంస్థలున్నా, కరోనా తర్వాత వీటి అవసరం బాగానే పెరిగింది. అందుకే నెట్‌ ఫ్లిక్స్‌.అమెజాన్‌ వంటి పెద్ద ఓటీటీలకు పోటీగా తెలుగు కోసం ప్రత్యేకం అంటూ ఆహాను అరవింద్ స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఆహా జాబితాలో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్ లు ఉన్నాయి. వాటన్నింటికి కూడా కోట్ల ఖర్చు అవుతోంది. మొత్తంగా కంటెంట్‌ కోసం ఆహా నిర్వాహకులు భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడిలో ఇప్పటి వరకు కనీసం 40 శాతం కూడా రిటర్న్‌ రాలేదట.

నిజానికి మొత్తం పెట్టుబడి మై హోమ్‌ రామేశ్వరావు , దిల్‌ రాజు కూతురు అల్లుడిది. రాబోయే 3,4 ఏళ్లలో ఇప్పుడు పెడుతున్న మొత్తం వడ్డీతో సహా రాబడుతుందన్న నమ్మకంతోనే అల్లు అరవింద్ ఖర్చు చేయిస్తున్నాడని టాక్. పైగా కంటెంట్‌ కు సంబంధించిన ప్రతి విషయాన్ని అల్లు అరవింద్ చూసుకుంటున్నాడు.కరోనా కారణంగా బయటకు వెళ్ల లేక పోయినా కూడా జూమ్‌ ద్వారా ప్రతి రోజు గంటలకు గంటలు చర్చలు జరపడడంతో పాటు కథలు వింటున్నట్లు అరవింద్ చెబుతున్నాడు. మొదట లో బడ్జెట్ వెబ్‌ సిరీస్‌, చిన్న సినిమాలను, పాత సినిమాలను స్ట్రీమింగ్‌ చేసిన ఆహా ఇప్పుడు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఆహా చందా రేటును భారీగా పెంచడంతో పాటు పే పర్ వ్యూ కూడా తీసుకు రావడం వల్ల లాభాలు దక్కించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

తమ బ్రాండ్‌ తో ఆహా ను ప్రమోట్‌ చేస్తూ, క్రియేటివ్‌ టీమ్ ను కూడా అరవింద్ లీడ్‌ చేయడంతో స్ట్రీమింగ్‌ అవుతున్న కంటెంట్‌ పెరిగింది. వరుసగా కొత్త సినిమాలను తీసుకు వస్తున్నారు. పెద్ద బడ్జెట్‌ సినిమాలను తీసుకు రాకున్నా, మంచి కంటెంట్‌ ఉంటె, చిన్న బడ్జెట్‌ సినిమాలను భారీ గా ఖర్చు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇక వెబ్‌ సిరీస్ లు , షో లను కూడా ఆహా తీసుకు వస్తుంది. వాటికి కూడా భారీగా ఖర్చు చేస్తోంది. ఇక అక్కినేని కోడలు సమంత చేస్తున్న సామ్ జామ్‌ టాక్ షో కోసం ఏకంగా నాలుగు నుండి అయిదు కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. వెబ్‌ సిరీస్ లకు రూ.50 లక్షల నుండి రెండు కోట్ల వరకు వెచ్చిస్తున్నారు.