ఒరేయ్ రిక్షా సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Narayana Murthy Orey Rikshaw : విప్లవ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అప్పట్లో చేసిన ఒరేయ్ రిక్షా మూవీ ఎంతటి హిట్ అనుకుందో చెప్పలేం. పాతికేళ్ల క్రితం రిలీజైన ఒరేయ్ రిక్షా ఇప్పటికీ జనం మనస్సులో స్థిరంగా ఉంది. డాక్టర్ దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ లో నటించిన నారాయణమూర్తికి మామూలు జనమే అతని సినిమాలో పాత్రధారులు. జనం సమస్యలే ఎజెండా. సినిమా ద్వారా ఏది చెబుతున్నాడో అదే ఆచరించి చూపిస్తున్నాడు. బ్లాంక్ చెక్స్ కూడా వద్దనుకున్న గొప్ప నటుడు. అర్ధరాత్రి స్వాతంత్య్రం నుంచి దండకారణ్యం వరకూ ఆయనిది అన్నలే బాట. స్నేహితులు ఇచ్చిన చొరవతో స్నేహ చిత్ర బ్యానర్ పెట్టి అర్ధరాత్రి స్వాతంత్య్రం సొంతంగా డైరెక్ట్ చేసాడు.

అప్పట్లో 16లక్షలతో తీసిన సినిమా అనూహ్య విజయం అనుకుంది. సారా వ్యతిరేఖ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన దండోరా మూవీ సెన్షేషనల్ హిట్ అయింది. వరుస విజయాలను అందుకుంటున్న నారాయణమూర్తితో మూవీ చేస్తే ఎలా ఉంటుందని దాసరి లో ఆలోచన వచ్చింది. రెమ్యునరేషన్ కూడా వద్దని కమిట్ మెంట్ ఇచ్చేసాడు. రవళి, ముక్కురాజు, ఎం ఎస్ నారాయణ ఇలా కొంతమంది నటీనటులు కూడా తీసుకున్నారు. గద్దర్, సినారె సాహిత్యం ఇచ్చారు. బాలు, చిత్ర పాడారు. 1995నవంబర్ 9న థియేటర్లలో రిలీజయింది. తొలిఆట నుంచి మంచి టాక్ వచ్చేసింది. యువత, మహిళలు కూడా సినిమా వైపు అడుగులు వేశారు.

రిక్షా యూనియన్ నేత పాత్రలో నారాయణ మూర్తి. అతడి చెల్లెలి పాత్ర రవళి. రాజకీయ నేపథ్యం గల మూవీ. కానీ నమ్మించి ఓట్లు వేయించుకుని తర్వాత గాలికి వదిలేసే వ్యక్తిని పోరాటం కోసం అడవికి వెళ్లి వాళ్ళను అంతమొందించడం ఈ మూవీ కథ. నారాయణ మూర్తి ఇమేజ్ చుట్టూ తిరిగినా, సెంటిమెంట్, సిస్టర్ ,లవ్ ఇలా అన్నీ రంగరించి తీసిన సినిమా ఇది. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ లో 8సాంగ్స్ హిట్. గద్దర్ రాసిన నీపాదం మీద పుట్టుమచ్చయిన చెల్లెమ్మా సాంగ్ ఇప్పటికీ జనంలో నానుతూనే ఉంది. బుర్రకథ సినారె రాసారు. సినిమాలో పేరు వద్దని, ప్రభుత్వం ఇచ్చే అవార్డు కూడా గద్దర్ తీసుకోలేదు. కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది. అయితే ఆయన సినిమాలకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వలేదు. ప్రజల రివార్డులు ఇతడికి అవార్డులు.