జనవరి 10 రాశి ఫలాలు…ఈ రాశులవారు శుభవార్త వింటారు

Horoscope Today : మేష రాశి
ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు ఆర్థికంగా చాలా బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది పని పట్ల శ్రద్ధ పెట్టాలి శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.

వృషభ రాశి
కాస్త ఖర్చులు తగ్గించుకోవాలి ఆర్థిక పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది శ్రమ ఎక్కువ అవుతుంది. ఆఫీసులో కూడా చిన్న చిన్న సమస్యలు రావచ్చు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.జై సంతోషిమాత ఆరాధన చేయండి. శుభవార్త వినే అవకాశం ఉంది.

మిధున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది చేసే పనులలో ఆటంకాలు వస్తాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓం నమశ్శివాయ పంచాక్షరి ఈ మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుంది

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది కష్టపడి పని చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయి ఇప్పటి వరకు ఉన్న విభేదాలు తొలగిపోతాయి. శ్రీ శివాష్టకం పారాయణ చేస్తే మంచిది.

సింహరాశి
అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి పనుల్లో జాప్యం జరుగుతుంది రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది.శుభవార్త వినే అవకాశం ఉంది.

కన్య రాశి
అనుకున్న పనులు చాలా తెలివితో చాలా తొందరగా చేస్తారు సాధ్యం అయినంత వరకూ వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలి దేవుని మీద భక్తి పెరుగుతుంది. శ్రీ పార్వతి మంగళాష్టకం పారాయణ చేయండి

తులారాశి
ఈ రోజు చేసే పనులలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల దూకుడు తగ్గించాలి.సమస్య వచ్చినా ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయండి.

వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు పలుకుబడి పెరుగుతుంది. పొరుగు వారి వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శివ అభిషేకం చేస్తే మంచిది.ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ఉంచుతుంది.

ధనస్సు రాశి
ఇంటిలో కొన్ని సమస్యల కారణంగా ఆ శాంతి గా ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. శ్రీ కృష్ణ అష్టకం పారాయణ చేయాలి

మకర రాశి
ఈరోజు చేయాలనుకున్న పనులు వాయిదా పడతాయి ప్రణాళిక వేసుకున్న పనులు చేయడంలో జాప్యం జరుగుతుంది కుటుంబ సమస్యలను తీర్చుకోవడంలో సమయం గడిచిపోతుంది శివునికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది

కుంభరాశి
ఈరోజు ఎంత శ్రమ పడ్డా శ్రమకు తగ్గ ఫలితం ఉండదు పనులు ముందుకు సాగవు. శివాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది.మీరు ఎదురు చూసే శుభవార్త వింటారు.

మీన రాశి
ఈరోజు అన్ని కలిసొస్తాయి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగి పోతుంది శ్రీ సూక్తం పారాయణ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారు కదా. ఇవి ఒక అవగాహన కోసమే. కాబట్టి మీరు కూడా అవగాహన కోసమే చూడండి.