రవితేజ ‘క్రాక్…’ సినిమా రివ్యూ… హిట్టా…ఫట్టా…?

krack movie review in telugu :రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు, వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తన శైలిలో వీర శంకర్ వారితో పెట్టుకుంటాడు. వారిలో, కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. పైగా అతను శంకర్‌పై తిరుగుబాటు చేయడానికి చాల బలంగా ప్రయత్నిస్తాడు. హీరోని చంపడానికి అతను ఎంత దూరమైనా వెళ్తాడు ? మరి కటారి, వీర శంకర్ ల మధ్య అసలు ఏమి జరిగింది ? చివరకు వీరశంకర్ ఏమి చేశాడు ? అనేది మిగిలిన సినిమా మొత్తం కథ.

సినిమాలో ప్లస్ పాయింట్స్
మాస్ ఎలిమెంట్స్
వరలక్ష్మి నెగెటివ్ పాత్ర
సంగీతం
సముద్రఖని

మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
కుటుంబ సన్నివేశాలు
సెకండ్ ఆఫ్ కొంచెం స్లో

క్రాక్ పాటలు, యాక్షన్ సీక్వెన్స్ అండ్ రవితేజ నటనతో పాటు మిగిలిన నటీనటుల నటన కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.