లాస్య YouTube ఛానెల్ పై దాడి చేసిన హాకర్స్…

lasya manjunath :బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన లాస్య తన సొంత YouTube ఛానల్ పై ఫోకస్ పెట్టింది.TV షోస్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగి, పెళ్ళి తరువాత టీవీ షోస్ కు దూరం జరిగి ఒక బాబుకు జన్మనిచ్చిన లాస్య, తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. హౌస్ లో హోమ్లీ గా ఉంటూ మంచి మార్కులు కొట్టేసిన లాస్య.. సెలబ్రిటీ అయింది. బిగ్ బాస్ వలన వచ్చిన క్రేజ్, లాస్య YouTube ఛానెల్ కు ఎంతో ఉపయోగపడింది. తన సొంత వీడియో లు, బిగ్ బాస్ హౌస్ సభ్యుల ఇంటర్వ్యూ వీడియో లు.. ఇలా లాస్య పెట్టే ప్రతీ వీడియో ట్రెండింగ్ అయింది. అయితే నిన్న లాస్య YouTube ఛానెల్ హ్యాకింగ్ కు గురైంది.

లాస్య కూడా తన YouTube ఛానెల్ హ్యాకింగ్ కు గురైంది అని చెప్పి బాధపడింది. తన ఛానెల్ తో పాటు తను కష్టపడి చేసిన వీడియో లు కూడా పోయాయని చెప్పింది. తన పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిందని లాస్య బాధను వ్యక్తం చేయగా, ఆమె అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ, ఇంకో ఛానెల్ మొదలుబెడితే తాము వెన్నంటి ఉంటామని రిప్లై లు ఇచ్చారు.