MoviesTollywood news in telugu

మాయలోడు సినిమా గురించి నమ్మలేని నిజాలు…లాభం ఎన్ని కొట్లో…?

mayalodu movie : ఎమోషన్, హాస్యాన్ని మేళవించి ఫ్యామిలీ మొత్తం కల్సి చూడతగ్గ సినిమాలను తెరకెక్కించడంలో ఎస్వీ కృష్ణారెడ్డి విభిన్నశైలి కనబరుస్తారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన మాయలోడు మూవీ బ్లాక్ బస్టర్. రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో మరో సూపర్ హిట్. కొబ్బరిబోండం మూవీతో కథ, మ్యూజిక్ అందించిన కృష్ణారెడ్డి, 1993లో మాయలోడు మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

కథ, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శాఖలతో మాయలోడు మూవీని డీప్ ఎమోషన్స్ తో నడిపించాడు. ఓ అమాయకపు పాప కోసం హీరో పడే పాట్లను చక్కగా తెరకెక్కించారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, బ్రహ్మానందం, అలీ, గుండు హనుమంతరావు, కామెడీ నవ్వులు పూయించింది. సమర్పకుడు కిషోర్ రాఠీ జడ్జిగా వేశారు.

ఈ మూవీలో అన్ని పాటలు హిట్ కాగా, బాబుమోహన్, సౌందర్యలపై తీసిన చినుకు చినుకు సాంగ్ అప్పట్లో ఓ ప్రభంజనమే. దాదాపు రెండు నెలలు శ్రమించి, కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, మాటల రచయిత దివాకర్ బాబు ఈ కథను కొలిక్కి తెచ్చారు. రాజమండ్రిలోని మోళీ ట్రూప్ దగ్గరకు వెళ్లి వాళ్ళ ఊతపదాలను రికార్డు చేయించి తీసుకొచ్చారు.

నేనుగానీ ఒక వీలగాని వేసానంటే అనే ఊతపదం ఇలా పెట్టిందే. నిర్మలమ్మ, పద్మనాభం, శ్రీలక్ష్మి, ఏవీఎస్, సుబ్బరాయ శర్మ తదితర నటులు కూడా ఇందులో ఉన్నారు. చిన్నపాప కోసం నార్త్ ఇండియాకు చెందిన నిఖితను సెలెక్ట్ చేశారు. పాలకొల్లులో చూసిన మేనరిజం చూసిన రచయిత దివాకర్ బాబు ఇందులో అలీ పాత్రకు పెట్టారు.

కేవలం 32రోజుల్లో ఏకధాటిగా సినిమా షూటింగ్ చేసారు. జొన్నవిత్తుల రాసిన చినుకు చినుకు సాంగ్ ని రాజేంద్రప్రసాద్,సౌందర్యలపై తీయాలనుకున్నా,ఎందుకో బాబుమోహన్, సౌందర్యలపై తీస్తే, వెరైటీగా ఉంటుందని కృష్ణారెడ్డి భావించారు. సౌందర్య ఒకే చెప్పేసింది. బాబూ మోహన్ అయితే నమ్మలేకపోయాడు.

జోక్ అనుకున్నాడు. తీరా నిజమని తెల్సి ఉబ్బితబ్బిబ్బయ్యారు. స్టెప్స్ కష్టపడి నేర్చుకున్నారు. 1993జులై 19న మూవీ రిలీజ్. 35సెంటర్స్ లో రిలీజ్ చేయగా, 7సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఫిలిం డవలప్ మెంట్ చైర్మన్ ఎం ఎస్ రెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల చీఫ్ గెస్టులుగా సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో 100డేస్ ఫంక్షన్ జరిగింది. ఉత్తమ్ చిత్రంగా నిలవడమే కాకుండా, బేబీ నిఖిత నంది అవార్డు అనుకుంది.