మెడ మీద ఏర్పడిన నలుపు నిమిషంలో పోవాలంటే….

Neck Beauty Tips :సాధారణంగా చాలా మంది ముఖం మీద పెట్టె శ్రద్ద మెడ మీద పెట్టరు. ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటె మెడ నల్లగా మారి అసహ్యంగా కనపడుతుంది.

మెడ మీద ఏర్పడిన నలుపు పోవాలంటే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నం చేయవచ్చు.మన వంటింటిలో దొరికే వస్తువులతో సులభంగా మెడ మీద నలుపును తొలగించుకోవచ్చు.

ఒక బౌల్ లో శనగపిండి,తేనే,నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని మెడ ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడాలో సరిపడా నిమ్మరసం కలిపి మెడ మీద నల్లని ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం కనపడుతుంది. వారంలో మూడు సార్లు ఈ విధంగా చేయాలి.

బియ్యం పిండిలో ద్రాక్ష రసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మెడకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.